భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఒక అత్యంత అమానవీయ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం ఇవ్వలేదన్న కోపంతో ఓ మహిళకు, ఆమె భర్త తరఫు కుటుంబసభ్యులు హెచ్​ఐవీ సోకిన సిరంజితో ఇంజెక్షన్​ ఇచ్చారు. ఆ తర్వాత, ఆమెకు హెచ్​ఐవీ సోకిందని ఆ మహిళ తండ్రి చెప్పారు. అత్తమామలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఉత్తర్​ప్రదేశ్​లోని సహరన్​పూర్ కోర్టు యూపీ పోలీసులను ఆదేశించింది.

గతేడాది మే నెలలో హరిద్వార్​లోని అత్తారింట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు ఉత్తర్​ప్రదేశ్​ మీరట్​లో నివాసముంటారు. 2023 ఫిబ్రవరిలో తన కుమార్తెకు వివాహం చేసినట్లు బాధితురాలి తండ్రి కోర్టుకు తెలిపారు. పెళ్లి కోసం దాదాపు రూ.45 లక్షలు ఖర్చు చేశానని వివరించారు. వరుడి కుటుంబానికి సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీ, రూ.15 లక్షల నగదు ఇచ్చామని తెలిపారు.

అయితే హరిద్వార్​లో...