భారతదేశం, మార్చి 29 -- CPM meet: సీపీఎం అఖిల భార‌త 24వ మ‌హాస‌భ‌లకు త‌మిళ‌నాడులోని మ‌ధురై వేదిక అయింది. ఏప్రిల్ 2 నుంచి 6 వ‌ర‌కు ఈ మ‌హాస‌భ‌లు జరగనున్నాయి. దేశంలోని అగ్ర‌నాయ‌క‌త్వం అంతా మ‌ధురై మ‌హాస‌భ‌ల‌కు హాజరువుతారు. ఈ సమావేశాల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరవుతారు. బ్రిటన్ నుంచి కూడా ఇద్ద‌రు ప్రతినిధులు హాజ‌రుకానున్నారు. ఈ మ‌హాస‌భ‌లో దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైన‌ 819 మంది ప్ర‌తినిధులు, ప‌రిశీల‌కులు హాజ‌రుకానున్నారు.

అలాగే మ‌హాస‌భ‌కు సమాంత‌రంగా జ‌రిగే సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు వెట్రిమార‌న్‌, ప్ర‌ముఖ న‌టులు విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాష్ రాజ్‌, మారి సెల్వ‌రాజ్, జ్ఞాన్‌వేలు, రోహిణి, ప్ర‌ముఖ న‌టులు, ద‌ర్శ‌కులు స‌ముద్ర‌ఖ‌ని, శ‌శికుమార్ త‌దిరులు పాల్గొంటారు. ...