భారతదేశం, ఏప్రిల్ 7 -- కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ లీగల్ డ్రామా చిత్రం భారీ కలెక్షన్లతో ఆశ్చర్యపరిచింది. ప్రియదర్శి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం మార్చి 14వ తేదీన విడుదలైంది. హర్ష్ రోహణ్, శ్రీదేవి కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అంచనాలను మించి బ్లాక్‍బస్టర్ అయింది. కోర్ట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో స్ట్రీమింగ్ తేదీ కన్ఫర్మ్ అయింది.

కోర్ట్ చిత్రం ఈ శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తేదీ గురించి ఇటీవలే రూమర్లు వచ్చాయి. అయితే, ఇప్పుడు అఫీషియల్‍గా కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో కోర్ట్ సినిమా లిస్ట్ అయింది. అధికారిక పోస్టర్ కూడా...