భారతదేశం, ఏప్రిల్ 1 -- ప్రియదర్షి, హర్ష్ రోహణ్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించిన 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి' చిత్రం అంచనాలకు మించి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ మార్చి 14వ తేదీన థియేటర్లలో రిలీజైంది. నేచులర్ స్టార్ నాని సమర్పించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఆరంభం నుంచి జోరుగా వసూళ్లను సాధించింది. ఈ కోర్ట్ చిత్రం ఇక ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేనుంది.

కోర్ట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు ఆ ఓటీటీ ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని అంచనాలు బయటికి వచ్చాయి. అయితే, ఆ ప్లాట్‍ఫామ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ...