భారతదేశం, మార్చి 17 -- కోర్ట్ చిత్రం కలెక్షన్లతో ఆశ్చర్యపరుస్తోంది. పక్కా కోర్ట్ రూమ్ లీగల్ డ్రామా వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‍తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. నేచురల్ స్టార్ నాని బ్యానర్‌లో సుమారు రూ.9కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ.. మూడు రోజుల్లోనే రూ.25కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. ఇప్పటికే లాభాల్లోకి అడుగుపెట్టింది. ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవి లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం దూసుకెళుతోంది. కోర్ట్ సినిమా ఈ రేంజ్‍లో విజయవంతం అయ్యేందుకు 5 కారణాలు ప్రధానంగా ఉన్నాయి.

నేచురల్ స్టార్ నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుందంటే మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఆ బ్యానర్‌లో వచ్చిన ఆ!, హిట్ 1, హిట్ 2 మంచి హిట్ అవడమే కాక ప్రశంసలు దక్కించుకున్నాయి. కోర్ట్ చిత్రాన్ని నాని నిర్మిస్తుండటంతో ము...