భారతదేశం, మార్చి 19 -- 'కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ' సినిమా బాక్సాఫీస్ రన్ జోరుగా సాగుతోంది. మార్చి 14న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ మూవీలో ప్రియదర్శి లీడ్ రోల్ చేశారు. హర్ష్ రోహణ్, శ్రీదేవీ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన కోర్ట్ చిత్రం వీక్‍డేస్‍లోనూ అదరగొడుతోంది.

కోర్ట్ చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.33.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఐదు రోజైన మంగళవారం ఈ చిత్రం రూ.4.65 కోట్ల వసూళ్లు దక్కించుకుంది. వీక్‍డే రోజు కూడా జోరు చూపి సత్తాచాటింది. ఐదు రోజుల్లోనే రూ.33కోట్ల మార్క్ దాటింది.

కోర్ట్ చిత్రానికి పాజిటివ్ టాక్ స్ట్రాంగ్‍గా ఉండడంతో థియేట్రికల్ రన్ అద్భుతంగా సాగుతోంది. లోబడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం అంచనాలకు మ...