భారతదేశం, జనవరి 26 -- సీనియర్ స్టార్ నటుడు మాధవన్ ప్రధాన పాత్ర పోషించిన హిసాబ్ బరాబర్ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సెటైరికల్ కామెడీ థ్రిల్లర్‌ సినిమాకు అశ్వినీ ధీర దర్శకత్వం వహించారు. ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే ఓటీటీలో హిసాబ్ బరాబర్ మూవీ దూసుకెళుతోంది. ఆ వివరాలు ఇవే..

హిసాబ్ బరాబర్ చిత్రం జనవరి 24వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీకి ఫస్ట్ డే నుంచే మంచి వ్యూస్ దక్కుతున్నాయి. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నా వ్యూస్‍లో ఈ చిత్రం దూసుకెళుతోంది. దీంతో జీ5 నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో ఈ మూవీ ప్రస్తుతం (జనవరి 26) టాప్‍కు వచ్చేసింది. ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.

హిసాబ్ బరాబర్ మూవీ హిందీలో రూపొందింది. జీ5 ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్‍కు ...