భారతదేశం, ఏప్రిల్ 14 -- గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రానికి ఆరంభం నుంచే చాలా క్రేజ్ కనిపించింది. తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో గత వారం ఏప్రిల్ 10న విడుదలైంది. అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, ఈ యాక్షన్ సినిమా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం సత్తాచాటుతోంది. టాక్‍తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ దుమ్మురేపింది. గుడ్ బ్యాక్ అగ్లీకి నాలుగు రోజుల్లోనే ఓ మైల్‍స్టోన్ కూడా దాటింది.

గుడ్ బ్యాక్ అగ్లీ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. నాలుగో రోజైన ఆదివారం సుమారు రూ.37 కోట్ల కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద జోష్ చూపింది.

గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి ఫస్ట్ డే సుమారు రూ.57కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి....