భారతదేశం, ఏప్రిల్ 7 -- హ్యుందాయ్​ ఎక్స్​టర్​ హై- సీఎన్జీ డుయో లైనప్​లో కొత్త వేరియంట్​ యాడ్​ అయ్యింది. దీని పేరు ఎక్స్​టర్​ హై-సీఎన్జీ డుయో ఈఎక్స్​. ఇది ఎంట్రీ లెవల్​ వేరియంట్​గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్తగా ప్రవేశపెట్టిన హ్యుందాయ్ ఎక్స్​టర్​ హై-సీఎన్జీ డుయో ఈఎక్స్ వేరియంట్ భద్రత, సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఆరు ఎయిర్​బ్యాగులు, 4.2 ఇంచ్​ కలర్ టీఎఫ్​టీ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్​ప్లే, సిగ్నేచర్ హెచ్-ఎల్ఈడీ టెయిల్​ల్యాంప్స్ ఉన్నాయి. ఈ వేరియంట్ డ్రైవర్ సీట్​ హైట్​ అడ్జెస్ట్​, కీలెస్ ఎంట్రీతో పాటు ఇతర ఫంక్షనల్ చేర్పులను కూడా అందిస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్​టర్​ హై- సీఎన్జీ డుయో భారీ సిలిండర్​కి బదులుగా రెండు చిన్న సీఎన్జీ సిలిండర్లను పొందుతుంది. హ్యుందాయ్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట...