భారతదేశం, జనవరి 12 -- CM Chandrababu : "నాడు దీపం 1 ద్వారా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. నేడు దీపం 2 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. మరొక్క అడుగు ముందుకు వేసి, 24 గంటలు గ్యాస్ సరఫరా అయ్యేలా, నేరుగా పైప్ లైన్ ద్వారా నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించాం" అని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుచానూరులో ఇంటింటికి నేచురల్ గ్యాస్ సరఫరాను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం తిరుచానూరులో ఓ వినియోగదారుడి ఇంట్లో స్టవ్‌ వెలిగించి టీ పెట్టారు. పైప్‌లైన్‌ గ్యాస్‌, సిలిండర్ గ్యాస్‌ మధ్య తేడాలను వినియోగదారుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాణిజ్య వాహనాలు, ఆటో రిక్షాలు, సీఎన్జీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఏపీ త్వరలోనే గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా మారుతుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. భవిష్యత్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామన...