భారతదేశం, మార్చి 16 -- ఇటివలి కాలంలో ఇండియాలో "డార్క్​ ఎడిషన్​" కార్లకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. దీన్ని క్యాష్​ చేసుకునేందుకు ఆటోమొబైల్​ సంస్థలు తమ బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​కి డార్క్​ ఎడిషన్​ని తీసుకొస్తున్నాయి. ఈ జాబితాలోకి సిట్రోయెన్​ కూడా చేరింది. బసాల్ట్​ కూపే ఎస్​యూవీకి డార్క్​ ఎడిషన్​ని సంస్థ ప్లాన్​ చేస్తోంది. ఇది త్వరలోనే లాంచ్​ అయ్యే సూచనలు సైతం కనిపిస్తున్నాయి. రాబోయే బసాల్ట్ డార్క్ ఎడిషన్​ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్​లో సంస్థ ఇప్పటికే టీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సిట్రోయెన్ బసాల్ట్ గత సంవత్సరం ప్రారంభంలో ఇండియా స్పెసిఫిక్ సీ-క్యూబ్ ప్లాట్​ఫామ్ కింద మూడవ మోడల్​గా విడుదలైంది. ఇటీవల విడుదలైన టీజర్.. సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ మొత్తం నలుపు రంగు ఎక్స్​టీరియర్​ని పొంద...