భారతదేశం, మార్చి 18 -- టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ్రిటన్‍లోని లండన్‍లో అడుగుపెట్టారు. యూకే పార్లమెంట్‍లో భాగమైన హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి ఆయన అరుదైన సత్కారం అందుకోనున్నారు. లండన్‍లోని హీత్రో విమానాశ్రయంలో చిరంజీవి నేడు దిగారు. ఆయనకు యూకే అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ వివరాలు ఇవే..

చిరంజీవికి లైఫ్‍టైమ్ అచీవ్‍మెంట్ అవార్డును యునైటెడ్ కింగ్‍డమ్ (హౌస్) పార్లమెంట్‍లోని హౌస్ ఆఫ్ కామన్స్ అందించనుంది. కళారంగం ద్వారా సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవాన్ని మెగాస్టార్‌కు ఇవ్వనుంది. హౌస్ సభ్యులు ఆయనను సత్కరించనున్నారు. రేపు (మార్చి 19) ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసమే లండన్‍కు వెళ్లారు చిరంజీవి.

లండన్‍లోని విమాశ్రయంలో చిరంజీవికి ఆయన అభిమానులు స్వాగతం పలికారు. యూకే మెగా అభిమానుల నుంచి వెల్‍కమ్ అన్నయ్యా అంటూ బ్యానర్లు పట్టుకొని మర...