భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఇటీవల కొందరు స్టార్ హీరో బిరుదులు మారిపోతున్నాయి. నట సింహంగా ఉన్న సీనియర్ హీరో బాలకృష్ణ ట్యాగ్ ఇటీవలే గాడ్ ఆఫ్ మాసెస్ అయింది. యంగ్ టైగర్‌గా చాలాకాలం పిలుచుకున్న జూనియర్ ఎన్టీఆర్ బిరుదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్‍గా మారింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా కాలం క్రితమే ఐకాన్ స్టార్ అయ్యారు. అయితే, మెగాస్టార్ చిరంజీవికి కూడా కొత్త టైటిల్ కనిపించింది. లైలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఈ మూవీ టీమ్ వెల్లడించిన పోస్టర్లో నయా టైటిల్ ఉంది.

లైలా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో మెగాస్టార్ చిరంజీవికి 'బాస్ ఆఫ్ మాసెస్' అంటూ కొత్త టైటిల్ ఉంది. మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ కోసం బాస్ ఆఫ్ మాసెస్ మెగాస్టార్ చిరంజీవి రానున్నారని ఓ పోస్టర్‌ను మూవీ టీమ్ రివీల్ చేసింది. ఈ ఈవెంట్ నేటి (ఫిబ్రవరి...