భారతదేశం, ఫిబ్రవరి 12 -- కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో 'బ్రహ్మా ఆనందం' సినిమా వస్తోంది. ఈ మూవీలో ఆయన కుమారుడు రాజా గౌతమ్ కూడా లీడ్ రోల్ చేస్తున్నారు. తండ్రీకొడుకులు ఈ మూవీలో తాతమనవళ్లుగా నటించారు. ఫిబ్రవరి 14వ తేదీన తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. బ్రహ్మా ఆనందం మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు మెగాస్టార్ చిరంజీవి, దర్శకులు నాగ్‍అశ్విన్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ ఈవెంట్‍లో మెగాస్టార్ చిరంజీవి హుషారుగా మాట్లాడారు. బ్రహ్మానందం గురించి గొప్పగా ప్రశంసించారు. అయితే, బ్రహ్మానందం మీమ్స్ గురించి సరదాగా మాట్లాడుతుండగా నోరు జారారు చిరంజీవి. రెడ్ ఫేస్.. ఎర్రముఖం పెడతాడు కదా ఎర్రి.. అంటూ ఓ బూతు మాట అన్నారు చిరంజీవి. దీంతో ఆ వెనుకాలే ఉన్న బ్రహ్మానందం, నాగ్‍అశ్విన్, రాజా గౌతమ్ ఆశ్చర్యపోయారు. అవాక...