భారతదేశం, ఫిబ్రవరి 12 -- బ్రహ్మా ఆనందం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ కామెడీ డ్రామా మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ తరుణంలో నిర్వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో చిరంజీవి మాట్లాడారు. అయితే, ఈ ఈవెంట్‍లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. ఆ వివరాలు ఇవే..

రామ్‍చరణ్ కూతురు క్లీంకార ఫొటోను ఈ ఈవెంట్‍లో చిరంజీవికి చూపించారు యాంకర్ సుమ. ఇతర మనవాళ్లతో చిరూ కలిసి ఉన్న ఫొటోను స్క్రీన్‍పై ప్రదర్శించారు. దీంతో చిరంజీవి స్పందించారు. ఇంట్లో ఉన్నప్పుడల్లా తనకు మనవరాళ్లతో ఉన్నట్టు ఉండదని, లేడీస్ హాస్టల్‍లో ఉన్నట్టు ఉంటుందని చిరంజీవి అన్నారు.

చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగపిల్లాడు కూడా లేడు అని చిరంజీవి అన్నారు. వ...