భారతదేశం, మార్చి 29 -- ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది! సుక్మా-దంతెవాడ సరిహద్దులోని ఉప్పంపల్లి కెర్లపాల్ ప్రాంతంలోని అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీ సుందర్రాజ్ పీ తెలిపారు.

తాజా ఎదురుకాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.

కెర్లపాల్ పోలీస్​స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త బృందం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి.

కెర్లపాల్ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి ఉందన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి ప్రారంభించిన ఈ ఆపరేషన్​లో జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 16 మంది మావోయిస్టుల మృ...