భారతదేశం, మార్చి 8 -- బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఛావా చిత్రం బాలీవుడ్‍‍లో దుమ్మురేపుతోంది. భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ మూవీకి ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా అదే రేంజ్‍లో భారీగా వస్తున్నాయి. ఈ హిస్టరికల్ యాక్షన్ మూవీ ఈ శుక్రవారమే (మార్చి 7) తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. తొలి రోజు కలెక్షన్ల లెక్కలు బయటికి వచ్చాయి.

ఛావా చిత్రం తెలుగు వెర్షన్ తొలి రోజు సుమారు రూ.3కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు మించి ఓపెనింగ్‍ను ఈ మూవీ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ రిలీజ్ చేసింది. 500కు పైగా థియేటర్లలో భారీగా ఈ సినిమాను విడుదల చేసింది. చాలా క్రేజ్ ఉండటంతో తెలుగులో మంచి ప్రారంభాన్ని ఛావా అందుకుంది.

ఛావా చిత్రం హిం...