భారతదేశం, మార్చి 31 -- ఛావా చిత్రం సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ సాధించింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం భారీ సక్సెస్ అయింది. ఛత్రపతి సంభాజీ మహరాజ్ జీవితంగా ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైంది. భారీ కలెక్షన్లను సాధించింది. మార్చిలో తెలుగులోనూ థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లను దక్కించుకుంది. ఛావా సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.

ఛావా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ వద్ద ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు వస్తుందని తాజాగా అంచనాలు బయటికి వచ్చాయి. థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాలకు స్ట్రీమింగ్‍కు తెచ్చేలా చావా మేకర్లతో నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకున్నట్టు సమాచా...