Hyderabad, ఫిబ్రవరి 15 -- Chhaava Box Office Collection: రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ నటించిన మూవీ ఛావా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు తొలి రోజే రికార్డు కలెక్షన్లు వచ్చాయి. మూవీకి మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చినా బాక్సాఫీస్ విషయంలో మాత్రం సక్సెసైంది. 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం.

లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన ఛావా మూవీ తొలి రోజు ఇండియాలో ఏకంగా రూ.31 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఈ వసూళ్లు వచ్చాయి. ఈ క్రమంలో వాలెంటైన్స్ డేనాడు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో గల్లీ బాయ్స్ పేరు మీద ఈ రికార్డు ఉంది. విక్కీ కౌశల్ కెరీర్లోనూ అతిపెద్ద ఓపెనింగ్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో అతడు అదరగొట్టాడు. అతని భార్య యేసు...