భారతదేశం, ఏప్రిల్ 1 -- చాట్ జీపీటీ కొత్త ఏఐ ఫీచర్ పుణ్యమా ఇప్పుడు సోషల్​ మీడియాలో ఎటు చూసినా స్టూడియో గిబ్లీ స్టైల్​లో మీమ్స్, ఫొటోల దర్శనమిస్తున్నాయి. నెటిజన్ల నుంచి వ్యాపారులు, రాజకీయ పార్టీలు, నాయకుల వరకు అందరూ ఈ ట్రెండ్​ని అనుసరిస్తూ తమకు నచ్చిన ఫొటోలు క్రియేట్​ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా ఫ్రీగా ఈ గిబ్లీ స్టైల్​ ఫొటోలు జనరేట్​ చేద్దామనుకుంటున్నారా? అయితే మీకు గుడ్​ న్యూస్​! ఈ గిబ్లీ స్టైల్​ని ఉచితంగా వినియోగదారులకు అందిస్తోంది ఓపెన్​ఏఐ.

గిబ్లీ స్టైల్​ ఫొటోలు ఇప్పుడొక సంచలనం. మొదటి రెండు రోజులు, ఈ ఫీచర్​ని చాట్ జీపీటీ తన ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంచింది. అయితే ఓపెన్ఎఐ ఇప్పుడు ఈ ఏఐ ఇమేజ్ జనరేషన్ ఫీచర్​ని ఫ్రీగా మార్చింది.

ఈ ప్రకటన ఇంటర్నెట్​లో హల్చల్ చేయగా.. నెటిజన్లు తమ రియల్​ లైఫ్​ ఫోటోలను యానిమేటెడ్ గిబ్లీ తరహ...