భారతదేశం, మార్చి 28 -- ఏప్రిల్​లో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంతో దేశంలో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. మరీ ముఖ్యంగా 2025 బడ్జెట్​లో నిర్మలా సీతారామన్​ ప్రకటించిన అనేక అంశాలు ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అనేక అంశాల్లో టీడీఎస్​ పరిమితిని పెంచారు. ఈ నేపథ్యంలో 'టీడీఎస్'​ విషయంలో కనిపించే మార్పులను ఇక్కడ తెలుసుకోండి..

"డివిడెండ్​ ఆదాయంపై ఇప్పటివరకు ఉన్న రూ. 5వేల టీడీఎస్​ ఇప్పుడు రూ.10వేలకు పెరుగుతుంది. ఇది సెక్యూరిటీ మార్కెట్​లో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్​ చేస్తున్న వారికి మంచిది," అని సీఏ నిపుణులు చెబుతున్నారు.

ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి వచ్చే మరో పెద్ద మార్పు.. లాటరీలు, గేమ్స్​, గుర్రం రేసుల్లో వచ్చే డబ్బుపై ఉన్న టీడీఎస్​ రూల్స్​. ఇప్పటివరకు ప్రతి ఆర్థిక ఏడాదిలో రూ. 10వేల లిమిట్​ ఇప్పుడు ప్రతి లావాదేవీకి రూ. 10వేలుగా మారన...