భారతదేశం, మార్చి 30 -- 2025-26 విద్యా సంవత్సరానికి సెకండరీ, సీనియర్ సెకండరీ తరగతుల (9, 10, 11, 12) సిలబస్​ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సీబీఎస్ఈ 9, 10, 11, 12 తరగతుల సిలబస్​ని బోర్డు అకాడమిక్ వెబ్సైట్​ cbseacademic.nic.in లో చూడవచ్చు.

9 నుంచి 12వ తరగతి వరకు అకాడమిక్ కంటెంట్, పరీక్షల సిలబస్, అభ్యసన ఫలితాలు, సిఫార్సు చేసిన బోధనా పద్ధతులు, మూల్యాంకన ఫ్రేమ్​వర్క్​లపై పాఠ్యప్రణాళిక సమగ్ర మార్గదర్శకాలను అందిస్తుందని డైరెక్టర్ (అకడమిక్స్) డాక్టర్ ప్రగ్యా ఎం సింగ్ తెలిపారు.

డాక్యుమెంట్ ప్రారంభ పేజీలలో పేర్కొన్న పాఠ్యప్రణాళిక ఆదేశాలను పాఠశాలలు ఖచ్చితంగా పాటించాలని సింగ్ అన్నారు. నిర్దేశిత సిలబస్​కు అనుగుణంగా సబ్జెక్టులను బోధించాలని, అనుభవపూర్వక అభ్యసన, సామర్థ్య ఆధారిత ...