భారతదేశం, మార్చి 14 -- బోర్డు పరీక్షలు రాస్తున్న సీబీఎస్​ఈ క్లాస్​ 12 విద్యార్థులకు కీలక అలర్ట్​! హోలీ వేడుకల కారణంగా మార్చ్​ 15న జరగనున్న పరీక్షకు ఎవరైనా హాజరుకాకపోతే, వారి కోసం 'స్పెషల్​' ఎగ్జామ్​ నిర్వహిస్తామని ప్రకటించింది సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్​ని జారీ చేసింది.

సాధారణంగా ఈ తరహా సీబీఎస్​ఈ స్పెషల్​ పరీక్షలను, రెగ్యులర్​ ఎగ్జామ్స్​ తర్వాత, క్రీడా విద్యార్థుల కోసం నిర్వహిస్తారు. ఈసారి, మార్చ్​ 15న పరీక్ష మిస్​ అయ్యే వారిని కూడా నిర్వహించనున్నారు.

దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్చ్​ 14న హోలీ పండుగను జరుపుకున్నప్పటికీ, కొన్ని చోట్ల మార్చ్​ 15న కూడా వేడుకలు ఉంటాయని తమ దృష్టికి వచ్చినట్టు, అందుకే విద్యార్థులకు మరొక అవకాశాన్ని ఇస్తున్నట్టు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపార...