భారతదేశం, సెప్టెంబర్ 11 -- కేంద్రం తెచ్చిన జీఎస్ట సంస్కరణలతో ఆటోమొబైల్​ కంపెనీలు తమ వాహనాలపై ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే! ఈ జాబితాలోకి సిట్రోయెన్​, హోండా కంపెనీలు తాజాగా చేరాయి. తమ పోర్ట్​ఫోలియోలోని అనేక వాహనాలపై ధరలను తగ్గిస్తున్నట్టు ఈ సంస్థలు స్పష్టం చేశారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

తాజాగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపుతో, సిట్రోయెన్ ఇండియా తన అన్ని మోడళ్ల కార్ల ధరలను తగ్గించింది. కొత్తగా విడుదలైన సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ కారు ధరలను ఇప్పటికే ప్రకటించిన కంపెనీ, ఇప్పుడు ఇతర మోడళ్ల కొత్త ధరలను కూడా వెల్లడించింది. ఈ తగ్గిన ధరలు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తాయి.

సిట్రోయెన్ సీ3, సీ3ఎక్స్: ఈ మోడళ్లపై గరిష్టంగా రూ. 84,000 వరకు ధర తగ్గింది. దీంతో సిట్రోయెన్ సి3 ప్రారంభ ధర ఇప్పుడు రూ. 4.80 లక్షలకు చ...