భారతదేశం, సెప్టెంబర్ 23 -- జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలవ్వడంతో పాటు నవరాత్రి ప్రారంభంకావడంతో దేశంలో ఆటోమొబైల్ మార్కెట్ మంచి జోరు అందుకుంది! దేశవ్యాప్తంగా కార్ల డీలర్లు భారీగా అమ్మకాలను నమోదు చేస్తున్నారు. మారుతీ సుజుకీ, హ్యుందాయ్​ మోటర్​ సంస్థలు నవరాత్రి మొదటి రోజే అదిరిపోయే సేల్స్​ చేశాయి.

జీఎస్టీ రేట్ల తగ్గింపు మొదటి రోజే (సెప్టెంబర్​ 22) తమ రిటైల్ అమ్మకాలు 30,000 యూనిట్లను దాటే అవకాశం ఉందని మారుతీ సుజుకీ వెల్లడించింది. మరోవైపు, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డీలర్లు కేవలం ఒక్క రోజులో దాదాపు 11,000 కార్ల బిల్లింగ్​లు చేశాయి. గత ఐదేళ్లలో ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో అమ్మకాలు నమోదు కావడం ఇదే మొదటిసారి!

ఇది పండుగ సీజన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోందని హెచ్‌ఎంఐఎల్ పూర్తి స్థాయి డైరెక్టర్, సీఓఓ తరుణ్ గార్గ్ అన్నారు. "జీఎస్టీ ప్రయోజనా...