భారతదేశం, ఆగస్టు 30 -- సొంత కారు కలను నెరవేర్చుకోవాలని చూస్తున్న వారికి గుడ్​ న్యూస్​! పండుగ సీజన్​ వేళ బ్యాంక్​ ఆఫ్​ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. కారు లోన్​లపై వడ్డీ రేట్లను తగ్గించింది. దీనితో బ్యాంక్ ఆఫ్ బరోడా కారు లోన్ ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు ఇప్పుడు 8.40 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గాయి. ఈ కొత్త రేట్లు వెంటనే ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అయితే, ఇది రుణగ్రహీత క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ సంవత్సరం మూడు ద్రవ్య విధాన సమావేశాల్లో రెపో రేటును మొత్తం 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్లు చొప్పున, జూన్ నెలలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని ప్రభావంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. అయితే, తాజా రేట్ల తగ్గింపు ...