భారతదేశం, సెప్టెంబర్ 7 -- కెనరా బ్యాంక్ ట్రెయినీ (సేల్స్ అండ్ మార్కెటింగ్) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ canmoney.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్​కి చివరి తేదీ అక్టోబర్ 6, 2025 అని గుర్తుపెట్టుకోవాలి.

ఈ ట్రెయినీలను వివిధ ప్రాంతాల్లోని సెంటర్లలో నియమిస్తారు. సెంటర్ల పూర్తి జాబితా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

కెనరా బ్యాంక్​ రిక్రూట్​మెంట్​ 2025 అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాల కోసం కింది సమాచారాన్ని చదవండి.

అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్‌లో 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.

వయస్సు ఆగస్టు 31, 2025 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

మార్కెటింగ్- సేల్స్ విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధా...