భారతదేశం, సెప్టెంబర్ 24 -- కెనరా బ్యాంక్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ canarabank.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 12, 2025 అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.

ఈ నియామకాల ద్వారా మొత్తం 3,500 మందిని అప్రెంటిస్‌లుగా ఎంపిక చేయనున్నారు. కెనరా బ్యాంక్​ అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు: సెప్టెంబర్ 1, 2025 నాటికి కనిష్టంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్స...