భారతదేశం, మార్చి 28 -- సీఏ (ఛార్టర్డ్​అ అకౌంటెంట్) అభ్యర్థులకు గుడ్​ న్యూస్​! సీఏ ఫైనల్ పరీక్షలను ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు కాకుండా, మూడుసార్లు నిర్వహిస్తామని ఇన్​స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తాజాగా ప్రకటించింది. ఇది 2025 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఇంటర్మీడియట్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను సంవత్సరానికి మూడుసార్లు నిర్వహించాలని గత ఏడాది ఐసీఏఐ నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు సీఏ ఫైనల్ పరీక్షలు కూడా అదే బాటలో నడుస్తాయని ఐసీఏఐ తెలిపింది.

"ప్రపంచ ఉత్తమ విధానాలకు అనుగుణంగా, విద్యార్థులకు ఎక్కువ అవకాశాలను అందించడానికి, సీఏ ఫైనల్ పరీక్షను సంవత్సరానికి మూడుసార్లు నిర్వహించాలని ఐసీఏఐ 26వ కౌన్సిల్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు జరిగేది," అని ఐసీఏఐ ఒక ప్రకటనలో తెలిపి...