భారతదేశం, ఫిబ్రవరి 2 -- గుజరాత్​లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు.. డాంగ్​ జిల్లాలో నాసిక్​- గుజరాత్​ హైవే మీద నుంచి పక్కనే ఉన్న 35 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని తెలుస్తోంది. 17మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.

గుజరాత్​లోని సపుతారా హిల్​ స్టేషన్​కి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తొలుత బస్సు నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కనే ఉండే క్రాష్​ బేరియర్​ని ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.

బస్సు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్​లోని ద్వారకాకు యాత్రికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి పరుగులు తీసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

బస్సు లోయలో పడిన సమయంలో వాహనంలో 48మంద...