భారతదేశం, మార్చి 8 -- ఈ రోజుల్లో ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్స్​ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు! బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​లో కూడా మంచి ఆప్షన్స్​ వస్తున్నాయి. మరి మీరు కూడా తక్కువ ధరకే మంచి గ్యాడ్జెట్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! మార్చ్​లో రూ. 15వేల లోపు ధరతో బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.72 ఇంచ్​ డిస్​ప్లేను ఈ స్మార్ట్​ఫోన్​ కలిగి ఉంది. ఈ డిస్​ప్లే 1050 నిట్స్ పీక్​ బ్రైట్​నెస్​ని అందిస్తుంది. ఐ ప్రొటెక్షన్​ కోసం టీయూవీ రీన్లాండ్-సర్టిఫికేట్ పొందింది.

మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్​ని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్​టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ లైవ్ టెక్ట్స్​, సర్కిల్ టు సెర్చ్, ఏఐ...