భారతదేశం, ఫిబ్రవరి 1 -- బడ్జెట్​ 2025లో భాగంగా దేశ ప్రజలకు నిర్మలా సీతారామన్​ శుభవార్త ఇచ్చారు! 12 లక్షల వరకు ఆదాయపుపన్ను ఉండదని నిర్మల ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న శ్లాబు రేట్లను మారుస్తున్నట్టు వెల్లడించారు.

"దేశ ఆర్థిక వ్యవస్థకు మధ్యతరగతి బలాన్ని అందిస్తుంది. వారి కృషికి గుర్తింపుగా ఎప్పటికప్పుడు పన్ను భారం తగ్గిస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను ఉండదని ప్రకటించడం సంతోషంగా ఉంది," అని నిర్మలా సీతారామన్​ వెల్లడించారు.

అంతేకాదు.. రూ. 75వేల స్టాండర్డ్​ డిడక్షన్​ ఉన్న వేతన జీవులకు రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిర్మల సీతారామన్​ తన బడ్జెట్​ 2025 ప్రసంగంలో స్పష్టం చేశారు.

ఆదాయం రూ. 4,00,000: నో ట్యాక్స్​

రూ. 4,00,001 నుంచి రూ. 8,00,000: 5% పన్ను

రూ. 8,00,001 నుంచి రూ. 12,00,000: 10% పన్...