భారతదేశం, ఫిబ్రవరి 1 -- బడ్జెట్​ 2025లో భాగంగా దేశ ప్రజలకు నిర్మలా సీతారామన్​ శుభవార్త ఇచ్చారు! 12 లక్షల వరకు ఆదాయపుపన్ను ఉండదని నిర్మల ప్రకటించారు.

"దేశ ఆర్థిక వ్యవస్థకు మధ్యతరగతి బలాన్ని అందిస్తుంది. వారి కృషికి గుర్తింపుగా ఎప్పటికప్పుడు పన్ను భారం తగ్గిస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను ఉండదని ప్రకటించడం సంతోషంగా ఉంది," అని నిర్మలా సీతారామన్​ వెల్లడించారు.

వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెడతామని నిర్మల ప్రకటించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సరళతరం చేయడానికి, సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తుందని వివరించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు పేజీల సంఖ్యను 60శాతం తగ్గించడానికి ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు.

ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961ను ఆరు నెల...