భారతదేశం, జనవరి 31 -- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఫిబ్రవరి 1, శనివారం పార్లమెంట్​లో బడ్జెట్​ 2025ని ప్రవేశపెట్టనున్నారు. సామాన్యుడి నుంచి వ్యాపారవేత్తల వరకు ఈ దఫా బడ్జెట్​ కోసం ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్​ పరిశ్రమ ఈసారి భారీ అంచనాలే పెట్టుకుంది. వృద్ధి, ఇన్నోవేషన్​, సుస్థిరత, ఎలక్ట్రిక్​ వాహన రంగానికి ఊతమిచ్చే విధంగా నిర్మలా సీతారామన్​ చర్యలు చేపట్టాలని ఆటోమొబైల్​ ఇండస్ట్రీ భావిస్తోంది.

ఆటోమొబైల్​ పరిశ్రమ భవిష్యత్తుపై బడ్జెట్​ 2025 కీలక పాత్ర పోషించనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుందని ఆశిస్తున్నాయి. స్థానిక తయారీకి ఊతమిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు నిపుణులు సిఫార్సులు చేస్తున్నారు. దీనితో పాటు రోజురోజుకు పెరిగిపోతున్న ముడి సరకు ధరలు, సప్లై...