భారతదేశం, జనవరి 31 -- కేంద్ర బడ్జెట్​ 2025 కోసం యావత్​ భారత దేశం ఎదురుచూస్తోంది. ఫిబ్రవరి 1, శనివారం ఉదయం పార్లమెంట్​లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. బడ్జెట్​ని ప్రవేశపెట్టనున్నారు. శనివారమే అయినప్పటికీ, బడ్జెట్​ నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఓపెన్​లోనే ఉంటాయి. చాలా మంది ట్రేడర్లు బడ్జెట్​ సమయంలో ట్రేడ్స్​ని కూడా ప్లాన్​ చేస్తుంటారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే.. జెరోధా సీఈఓ నితిన్​ కామత్​ చెప్పిన కొన్ని విలువైన టిప్స్​ మీకు ఉపయోగపడతాయి. అవేంటంటే..

స్టాక్​ మార్కెట్​ అంటేనే ఒడిదొడుకులు సహజం. బడ్జెట్​ సమయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు నితిన్ కామత్ కొన్ని టిప్స్​ చెబుతూ ట్వీట్​ చేశారు. బడ్జెట్ ప్రకటన వంటి అధిక ప్రభావం ఉన్న రోజుల్లో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

"మార...