భారతదేశం, ఫిబ్రవరి 1 -- దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు "బడ్జెట్​ 2025"లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త ఇచ్చారు. సీతారామన్ తన ఎనిమిదో బడ్జెట్ ప్రసంగంలో క్రెడిట్ గ్యారంటీ కవర్ పరిమితులు సహా ఈ రంగానికి కేటాయింపులను పెంచబోతున్నట్లు పేర్కొన్నారు.

సూక్ష్మ పరిశ్రమలైన ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కవరేజీని రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు రెట్టింపు చేయనున్నాట్టు నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. ఫలితంగా వచ్చే ఐదేళ్లలో అదనంగా రూ.1.5 లక్షల కోట్ల రుణం లభిస్తుందని వివరించారు.

చిన్న వ్యాపారాల కోసం రూ .5 లక్షల పరిమితితో కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులను అందించనున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇందుకోసం సదరు వ్యాపారాలు "ఉద్యోగ్ పోర్టల్"లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీని వల్ల ఎస్ఎంఈలకు వర్కింగ్ క్...