Hyderabad, మార్చి 28 -- BTS Jungkook: సౌత్ కొరియాలో కొన్ని రోజులుగా వ్యాపిస్తున్న కార్చిచ్చు ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలుసు కదా. ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున రక్షణ చర్యలు జరుగుతున్నాయి. దీనికోసం ఎంతో మంది విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా శుక్రవారం (మార్చి 28) బీటీఎస్ బ్యాండ్ సభ్యుడు జంగ్‌కూక్ భారీ విరాళం ఇచ్చినట్లు హోప్ బ్రిడ్జ్ కొరియా డిజాస్టర్ రిలీఫ్ అసోసియేషన్ వెల్లడించింది.

సౌత్ కొరియాలో ఈవారం మొదటి నుంచీ కార్చిచ్చు రగులుతోంది. అక్కడి హోప్ బ్రిడ్జ్ డిజాస్టర్ రిలీఫ్ అసోసియేషన్ రక్షణ, సహాయ చర్యలు చేపడుతోంది. దీనికోసం తాజాగా జంగ్‌కూక్ 100 కోట్ల సౌత్ కొరియన్ వోన్ (సుమారు రూ.5.82 కోట్లు)లను విరాళంగా ఇచ్చాడు. ఇప్పటి వరకూ సెలబ్రిటీలు ఇచ్చిన విరాళాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

సౌత్ కొరియాలోని కొన్ని ప్రాంతాలు ఈ కార్చిచ్చు వల్ల చ...