భారతదేశం, ఫిబ్రవరి 15 -- భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక (క్యూ3ఎఫ్​వై25) ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ 2007 తర్వాత తొలిసారిగా నికర లాభాన్ని ప్రకటించడం విశేషం. ఫలితంగా.. నాడు ఒక వెలుగువెలిగిన ఈ దిగ్గజ టెలికాం సంస్థకు పునర్వైభవం లభిస్తోందని అందరు భావిస్తున్నారు.

17ఏళ్ల తర్వాత బీఎస్​ఎన్​ఎల్​ లాభాల్లోకి రావడంపై టెలీకమ్యూనికేషన్స్​ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. సేవలను అందించడం, చందాదారుల సంఖ్యను విస్తరించడంపై దృష్టి సారించిన టెలికాం దిగ్గజానికి ఈ త్రైమాసిక ప్రదర్శన్​ "ముఖ్యమైన మలుపు" అని అభివర్ణించారు. మొబిలిటీ, ఎఫ్​టీటీహెచ్, లీజ్డ్ లైన్ సర్వీస్ ఆఫర్లలో బీఎస్ఎన్ఎల్ 14-18 శాతం వృద్ధిని సాధించిందని ఆయన తెలిపారు.

బీఎస్ఎన...