భారతదేశం, జనవరి 30 -- BSNL BiTV: గట్టి పోటీ నెలకొన్న భారత టెలీకాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. యూజర్లను ఆకర్షించే మరో చర్య చేపట్టింది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఉచితంగా చానెళ్లను, ఓటీటీ కంటెంట్ ను వీక్షించే వీలు కల్పించే ఇంటర్నెట్ టీవీ సేవను ప్రారంభించింది. ఇది భారతదేశం అంతటా తన మొబైల్ చందాదారులకు 450 కి పైగా లైవ్ టెలివిజన్ ఛానళ్లకు ఉచితంగా చూసే వీలు కల్పిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ ఇంటర్టైన్మెంట్ (BSNL Intertainment BiTV) అనే పేరుతో ఈ ఇంటర్నెట్ టీవీ సేవలను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. దీనిని మొదట పైలట్ ప్రాజెక్టుగా పాండిచ్చేరిలో ప్రారంభించారు. తరువాత దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. స్ట్రీమింగ్ అగ్రిగేటర్ ఓటీటీప్లేతో (OTTplay) భాగస్వామ్యం ద్వారా, బిఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు వివిధ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లను, విస్తృతమైన కంట...