భారతదేశం, మే 3 -- Brij Bhushan BJP : రెజ్లర్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా మాజీ చీఫ్​, బీజేపీ బాహుబలి నేత బ్రిజ్​ భూషణ్​పై రెజర్లు లైంగిక దాడి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై గతేడాది రెజ్లర్లు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఇక తాజాగా.. 2024 లోక్​సభ ఎన్నికల్లో బ్రిజ్​ భూషణ్​కి బీజేపీ టికెట్​ ఇవ్వలేదు కానీ.. ఆయన స్థానంలో, ఆయన కుమారుడిని నిలబెట్టింది కమలదళం. ఈ విషయంపై రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత దేశ కూతుళ్లు ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

"భారత దేశ కూతుళ్లు ఓడిపోయారు. బ్రిజ్​ భూషణ్​ గెలిచారు. మా కెరీర్లను పణంగా పెట్టి.. చాలా రోజుల పాటు ఎండనకా వాననకా రోడ్ల మీద పడుకున్నాము. కానీ ఇప్పటివరకు బ్రిజ్​ భూషణ్​ని అరెస్ట్​ చేయలేదు. ఇప్పుడు.. ఆయన కుమారుడికి టికెట్​ ఇచ్చారు. మేము ఏమీ అడగట్లేదు. న్యాయం మాత్రమే డిమాండ్​ చే...