Hyderabad, ఏప్రిల్ 7 -- Brahmamudi Serial: స్టార్ మా టాప్ సీరియల్స్ లో ఒకటైన బ్రహ్మముడి.. ప్రైమ్ టైమ్ నుంచి మధ్యాహ్నానికి మారిన తర్వాత క్రమంగా తన టీఆర్పీ కోల్పోతూ వస్తోంది. అయితే తాజాగా ఇప్పుడీ సీరియల్ కు మరో పోటీ ఎదురవుతోంది. జీ తెలుగు ఛానెల్ నుంచి దీర్ఘసుమంగళీభవ పేరుతో ఓ కొత్త సీరియల్ సోమవారం (ఏప్రిల్ 7) నుంచి ప్రారంభమైంది.

బ్రహ్మముడి ఒకప్పుడు తెలుగు టీవీ సీరియల్స్ ను ఏలింది. టీఆర్పీల్లో ఎన్నో నెలల పాటు నంబర్ వన్ స్థానంలో కొనసాగింది. అయితే రాత్రి 7.30కు వచ్చే ఈ సీరియల్ ను తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు మార్చారు. దీంతో ఈ సీరియల్ టీఆర్పీ పడిపోయింది. ఒక దశలో టాప్ 10 నుంచి కూడా వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు ఒంటి గంటకు కూడా బ్రహ్మముడికి పోటీగా కొత్త సీరియల్ వచ్చింది.

ఈ సీరియల్ పేరు దీర్ఘసుమంగళీభవ. ఈ సీరియల్ ను సోమవారం నుంచి జీ తెలుగు ఛానెల్ ప్...