భారతదేశం, మార్చి 19 -- దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ కలిసి నటించిన 'బ్రహ్మా ఆనందం' చిత్రం అనుకున్న స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం లీడ్ రోల్ చేయడంతో ఈ మూవీకి మంచి క్రేజ్ వచ్చింది. మిక్స్డ్ టాక్ రావటంతో పెద్దగా కలెక్షన్లు దక్కలేదు. ఈ బ్రహ్మా ఆనందం చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

బ్రహ్మా ఆనందం చిత్రం నేడు (మార్చి 19) ఆహా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ప్రస్తుతం ఆహా గోల్డ్ ప్లాన్ సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. సాధారణ ప్లాన్‍‍లతో ఉన్న వారికి ఇంకా ఈ చిత్రం యాక్సెస్‍కు రాలేదు. ప్రకటించిన తేదీ కంటే 24 గంటల ముందే బ్రహ్మా ఆనందం చిత్రం ఆహా గోల్డ్ యూజర్లకు స్ట్రీమింగ్ అవుతోంది.

బ...