భారతదేశం, సెప్టెంబర్ 14 -- ఆసియా కప్​లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు జరగుతున్న ఇండియా-పాకిస్థాన్​ మ్యాచ్‌పై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన అమాయకులకు, ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు ఈ మ్యాచ్ ఒక అవమానమని సామాజిక మాధ్యమాల్లో చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీనితో #BoycottIndvsPak వంటి హాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ మాజీ క్రికెటర్లు, జర్నలిస్టులు, ప్రముఖులు అభిమానులకు పిలుపునిచ్చారు.

సాధారణంగా ఇండియా-పాక్ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు! కానీ ఆసియా కప్​ 2025లో భాగంగా, దుబాయ్‌లో జరగనున్న ఈ గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌కు మాత్రం టికెట్ల విక్రయాలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన పది రోజుల తర్వాత కూడా స్టేడియంలో దాద...