భారతదేశం, మార్చి 9 -- స్టాక్​ మార్కెట్​లో డివిడెండ్లు ఇచ్చే కంపెనీలతో పాటు బోనస్​ షేర్లు ప్రకటించే సంస్థలపైనా మదుపర్ల ఫోకస్​ ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల వ్యవధిలో రెండుసార్లు బోనస్​ షేర్లను ఇచ్చిన ఓ సంస్థ.. ఇప్పుడు మూడోసారి బోనస్​ షేర్లను ప్రకటించింది. ఈ సంస్థ స్టాక్​ ధర రూ. 30లోపే ఉండటం మరో విశేషం. ఇప్పుడు మీరు తెలుసుకోబోతోంది ఎస్​బీసీ ఎక్స్​పోర్ట్స్​ లిమిటెడ్​ అనే సంస్థ గురించి. వివరాల్లోకి వెళితే..

ఎస్​బీసీ ఎక్స్​పోర్ట్స్​ లిమిటెడ్ అనేది దేశంలో లీడింగ్​ గార్మెట్​ కంపెనీని అని సంస్థ చెబుతోంది. కాగా ఈ సంస్థ ఈ వారం మరోసారి బోనస్ ఇవ్వనుంది. కంపెనీ తన పెట్టుబడిదారులకు 2 షేర్లపై ఒక షేరు బోనస్ ఇవ్వబోతోంది. ఈ బోనస్ ఇష్యూకు రికార్డు తేదీ ఈ వారం.

ఈ వారం బోనస్ ఇష్యూకు సంబంధించిన రికార్డు తేదీ కోసం ఎక్స్​ఛేంజ్​కి సమర్పించిన ఫైలింగ్​ ప్రకారం.. ...