భారతదేశం, అక్టోబర్ 6 -- బిహార్​ ఎన్నికల షెడ్యూల్​ని భారత దేశ ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం ప్రకటించింది. 243 సీట్లున్న బిహార్​ అసెంబ్లీకి మొత్తం 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 6, 11వ తేదీల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నవంబర్​ 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఈసీ తాజా ప్రకటనతో బిహార్​లో ఎన్నికల కోడ్​ నేడు అమల్లోకి వచ్చింది.

2025 బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో 7.43 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్​ జ్ఞానేశ్​ కుమార్​ వెల్లడించారు. వీరిలో సుమారు 3.5 కోట్ల మంది మహిళలు, 14లక్షల మంది తొలిసారి ఓటర్లు ఉన్నట్టు వివరించారు. కాగా 14వేల మంది ఓటర్ల వయస్సు 100ఏళ్లు పైబడి ఉందని పేర్కొన్నారు. 90,712 పోలింగ్​ కేంద్రాలు ఉంటాయని తెలిపారు.

మరోవైపు ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కాగా ...