Hyderabad, ఏప్రిల్ 10 -- Best Thrillers on Netflix: థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు పెట్టింది పేరు నెట్‌ఫ్లిక్స్. వీటిలో ఎంతో ఆసక్తి రేపే థ్రిల్లర్ తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి. డైరెక్ట్ తెలుగుతోపాటు తమిళం, మలయాళం నుంచి డబ్ అయిన మూవీస్ ని కూడా వీటిలో చూడొచ్చు. మరి వాటిలో టాప్ 6 బెస్ట్ థ్రిల్లర్స్ ఏవో చూడండి.

మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అన్వేషిపిన్ కండెతుమ్. స్టార్ హీరో టొవినో థామస్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలో రెండు హత్యలు, వాటి ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఊహించని ట్విస్టులతో ఈ మూవీ మంచి థ్రిల్ పంచుతుంది. నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులోనూ అందుబాటులో ఉంది.

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన మూవీ మహారాజా. ఇందులో అతడు ఓ సాధారణ బార్బర్ పాత్రలో కనిపించాడు. తన ఇంట్లో ఉన్న చెత్త డబ్బా పోయిందంటూ పోల...