భారతదేశం, ఏప్రిల్ 12 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా కొనసాగుతోంది ఎంజీ విండ్సర్​ ఈవీ. ఇప్పుడు ఈ మోడల్​కి సంబంధించి బిగ్​ అప్డేట్​ ఇచ్చింది జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా. భారత మార్కెట్​లో కేవలం 6 నెలల్లోనే 20,000 యూనిట్ల విండ్సర్ ఈవీని విక్రయించినట్లు ప్రకటించింది. ఫలితంగా అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న తొలి ఎలక్ట్రిక్ వెహికిల్​గా నిలిచింది ఎంజీ విండ్సర్​ ఈవీ. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ విండ్సర్​ ఈవీలో 38 కిలోవాట్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఇది 332 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్​ని అందిస్తుంది. అయితే, రియల్​ టైమ్​లో ఈ రేంజ్​ 260 నుంచి 280 కి.మీ వరకు ఉంటుందని సమాచారం. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించినప్పుడు బ్యాటరీని 55 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అదనంగా, ఎలక్ట్రిక్ కారుల...