భారతదేశం, సెప్టెంబర్ 14 -- వాహనాలపై జీఎస్టీ తగ్గిన విషయం తెలిసిందే. గతంలో కార్ల మీద 28 శాతం జీఎస్టీతో పాటు 17-22 శాతం సెస్ ఉండేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చిన్న కార్లపై పన్నును 18 శాతానికి తగ్గించింది. సెస్ పూర్తిగా తొలగించింది! ఫలితంగా ఆటోమొబైల్​ సంస్థలు తమ పోర్ట్​ఫోలియోలోని వెహికిల్స్​పై ధరలను తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​కి చెందిన ధరలు కూడా దిగొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో ఆగస్ట్​ 2025లో అమ్ముడైన టాప్​ 5 కార్లు, వాటిపై సంస్థలు ప్రకటించిన ప్రైజ్​ కట్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ ఆగస్టులో ఎర్టిగా ఎంపీవీని 18,445 యూనిట్లు అమ్మి, టాప్ సెల్లర్‌గా నిలిచింది. అయితే, గత ఏడాది ఆగస్టు 2024లో 18,580 యూనిట్లు అమ్మింది. దీనితో వార్షిక ప్రాతిపదికన అమ్మకాల్లో 1 శాతం తగ్గుదల కనిపించింది. కొత్త...