భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఇండియాలో ఎస్​యూవీతో పోటీని తట్టుకుని నిలబడుతున్న అతి తక్కువ సెడాన్​ మోడల్స్​లో హోండా సిటీ ఒకటి! సెడాన్​ అంటే హోండా సిటీ అన్న రేంజ్​కి ఈ మోడల్​ ఎదిగింది. ఈ నేపథ్యంలో హోండా సిటీకి మరింత ప్రీమియం టచ్​ ఇస్తూ.. సరికొత్త ఎడిషన్​ని లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. దీని పేరు హోండా సిటీ అపెక్స్​. ఇదొక లిమిటెడ్​ ఎడిషన్​ సెడాన్​. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ ధర రూ .13.30 లక్షల నుంచి రూ .15.62 లక్షలు (ఎక్స్​షోరూమ్) వరకు ఉంది. కొత్త అపెక్స్ ఎడిషన్ ప్రత్యేక యాక్ససరీ ప్యాకేజీతో సూక్ష్మమైన అప్​గ్రేడ్​లతో వస్తోంది. స్టాండర్డ్ వర్షెన్ కంటే లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.25,000 ఎక్కువ.

కొత్త హోండా సిటీ అపెక్స్ సెడాన్​ ఎడిషన్ గత సంవత్సరం వచ్చిన ఎలివేట్ అపెక్స్ ఎడిషన్​తో చేరుతుంది...