Hyderabad, ఏప్రిల్ 2 -- Best Horror Movies on Aha OTT: హారర్, హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ తెలుగులో ఆహా వీడియో ఓటీటీలో ఇలాంటి మూవీస్ ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని నేరుగా వచ్చినవి కాగా.. మరికొన్ని వివిధ భాషల డబ్బింగ్ మూవీస్ కావడం విశేషం. మరి వాటిలో మస్ట్ వాచ్ హారర్ మూవీస్ ఏవో చూసేయండి.

హన్సిక నటించిన సింగిల్ క్యారెక్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఆహా వీడియోతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ అందుబాటులో ఉంది. ఈ సింగిల్ క్యారెక్ట‌ర్ మూవీకి రాజు దుస్సా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జాను (హ‌న్సిక‌) అనుకోని ప‌రిస్థితుల్లో ఓ అదృశ్య శ‌క్తి కార‌ణంగా త‌న ఇంట్లోనే బందీగా మారుతుంది. జానును చంపాల‌ని ఆ అదృశ్య శ‌క్తి ఎందుకు ప్ర‌య‌త్నిస్తుంది? జానుపై ఆ శ‌క్తి ప‌గ ప‌ట్ట‌డానికి కార‌ణం ఏమిటి? ఆ అదృశ్య శ‌క్తి బారి నుంచి జాను త...